Wednesday, August 24, 2011

బాధలు లేని నేను


గతాన్ని ఎక్కువగ గుర్తు ఉంచుకోవడానికి ప్రయత్నం జరగనప్పుడు,

గతం ఎక్కువగ గుర్తు ఉంచుకోనప్పుడు - క్షమా గుణం పెరుగుతుంది,

అనుభూతులు - కోపం, ఈర్ష్య, కలుగుతున్నపుడు ఏఱుకలో ఉంటె,


మంచి - చెడు ; ఒప్పు - తప్పు ; ల మద్యలో ఉండి,

పాదరసం లా నీకేది అంటిచ్చుకోనప్పుడు,

(ఎఱుకలో ఉంటు చెసేది ఒప్పు అని నా విశ్వాసం)


నీ తప్పులని చూసి నువ్వు నవ్వుకున్నప్పుడు,

నీ అమాయకత్వాన్ని నువ్వు మెచ్చుకున్నప్పుడు,

ఙానం కోసం నువ్వు నిరంతర ప్రయత్నం సాగిస్తుంటే,


బాధలు లేను నన్ను నేను చూసుకోగల్గుతున్నాను..!

నువ్వు లేకుంటే..ఒక్కన్నే..

 అమ్మమ్మా, నీకు ఎలా టైం గడుస్తుందే...ఎం పని లేనప్పుడు నువ్వు ఊరికే అలా కూర్చొని ఉంటావు..ఉరికే కూర్చుంటే నీకు బోర్ కొట్టదా?

"అతిధి కోసం ఎదిరి చూస్తున్నాను
నాకు తెలుసు ఇంకో కొన్ని నెలలు మాత్రమె, నేను ఈ శరీరం లో ఉండేది,
 ప్రకృతి లో కలవడానికి ముహూర్తం కుదిరింది"

 అని, అవును నాన్న , నేను లేకుంటే నువ్వేమి చేస్తావు,
"అంటే" - 
 అంటే నేను చనిపోయిన తరువాత, నువ్వు ఈ ఆటలన్ని ఎవరితో ఆడతావ్!
 "ఒక్కన్నే ఆడుకుంటా..." - నువ్వు ఉన్నావు కాబట్టి నీతో, లేకుంటే...ఒక్కన్నే...

 ఆహా ...అని అబ్బురపడి తన శరీరాన్ని అక్కడే విడిచి వెళ్ళింది అనసూయ...!!