Saturday, August 29, 2009

నా శోదనే నాకు ప్రశ్నైతే ! - 2


"నేను వెళ్తున్నాను", అని అన్నప్పుడు ఆ వాక్యం లోని "నేను" అని మనం ఎవరిని సంభోదిస్తున్నాం?

నేను ఈ టపా రాస్తున్నాను, దీంట్లో నేను అంటే నా శరీరం, నా "మనస్సు" రెంటి కలయిక వల్ల నేను ఈ టపా రాయాగల్గుతున్నాను.
ఆత్మ అంటే ఈ రెంటిని కాదని ఉండేది అంటే దానిని నేను ఎలా ఊహించేది, నా అవగాహనలోకి ఎలా తెచ్చుకునేది?
సరే, పెద్దలు చెప్పినట్లు ఆలోచన లేకుండా ఉండే స్తితి ఏ ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే, మనిషి ఆలోచన లేకుండా సాంఘీక జీవనాన్ని గడపలేదు.
అంటే, ఆత్మ అనేది కేవలం ఆలోచన రహిత స్తితి కాదని అర్ధం అవుతుంది. ఏమన్టావ్?

ఆలోచన రహిత స్తితి లో మనం మనం అంటే శరీరం, మనస్సు కాదని తెలుసుకోవడానికి అవకాశంగా చూడొచ్చు.
మరి ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే నేను ఇంకా ఏమీ చేయాలి?

పెద్దవారు చెప్తారు, ధ్యానం చేయమని, ఏ? ఎందుకు ? ధ్యానం లో జరిగేది, నేయా ఆలోచన రహిత స్తితి లో జరగనిది ఒకటి కాదా?

అంటే నేను ఎక్కువ కాలం ఆ ఆలోచన రహిత స్తితి లో ఉండాలా ?

ఊహా ప్రపంచం ఎంత బాగుంటుందో..ఊహల్తో మనం ఎన్నో అద్బుటాలు సృష్ఠించొచ్చు. ఊహ కూడా ఒక ఆలోచనే కదా?

-ఇంకా ఉంది

Saturday, August 22, 2009

నా శోదనే నాకు ప్రశ్నైతే !


మనమెందుకు మనకు తెలియనిది ఏదో ఉందని విశ్వసిస్తున్నాం?
మనమెందుకు ఆ "తెలియనిది" తెలుసు కోకుంటె జీవితం వృథ అన్న భావన లొ ఉన్నాం?
ఆత్మ సాక్షాత్కారమే అంతా అన్నట్లుగ మన మాటలు, చేష్టలు జరుగుతున్నాయి?
'ఆత్మ సాక్షాత్కారం' అనే భ్రమ లొ జీవిస్తున్నామా? లెదా, మనని మనమే ఇతరులతో వేరుగా గుర్తింప జేసుకొవదానికి ఈ భావనతొ బ్రతుకుతున్నామా?
కనిపించేది, స్పౄషించేది శరీరం, ఆలోచించేది, సంఘం తో పాటు జీవింప జేసేది ఈ మనసు.
మరింకెందుకు, ఇంకేదో ఉందని మనం అనుకుంటున్నాం, జపిస్తున్నాం, తపిస్తున్నాం?
పుట్టడం, పెరగడం, ఆశలు, ఆకలి, కోరికలు, లక్ష్యాలు, గెలుపు, ఓటమి, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, బంధాలు, ఆవేశాలు, అవమానాలు, చిరాకులు, ముసలి వాళ్ళవడం, మన ముందే చనిపోయిన వాళ్ళ లాగ మనము చనిపొవడం తెలిసిందే, మనం చూసిందే, చూస్తుందే, మనకు జరుగుతుందే,

జరగ బోయెదే అని తెలుసు.
అలాగె జీవిద్దాం.
మనకెందుకీ తంట, ఏదో లెని దాని, కనబడని దాని గురించి, ఎక్కువ మంది మాట్లాడని దాని గురించి, చాలా తక్కువ మందికె తెలిసిన దాని గురించి ఆరాటం, తెలియని దాని(అసలు, ఉన్నదో లెదో కూదా తెలియదు) గురించి తపన ?

- ఇంకా ఉంది

Thursday, August 20, 2009

నిద్ర లో 'నేను'


నిద్ర లో 'నేనూ ఎక్కడున్నాను?

అది నా నిద్రే అని నాకు తెలిసేదెలా?
నిద్రకు ముందు నేను 'నిద్రపొబోతున్నానని ' తెలుస్తుంది,
ఉదయాన్నె నేను నిద్ర నుండి మెల్కొన్నానని తెలుస్తుంది,
కాని నిద్ర లోకి జారుకున్న తరువాత - నిద్ర నుండి లేవక ముందు, నేను ఎక్కడ ఉన్నా అనే ప్రశ్న వచ్చింది నాకు.

సరే, ఈ సంఘటనను నా దినచర్య లో ఒక పని తొ పోల్చుదాం.భోజనానికి ముందు - భోజనం తరువాత కార్యక్రమాన్ని తీసుకుందాం,నా భోజన కర్యక్రమమంత నాకు గుర్తు ఉంటుంది,నేను ఎం చెసాను, ఎల చెసాను అనె విషయాలు గుర్తుంటాయి,ఎవరైనా అడిగినప్పుదు ఆ వివరాల్ని నేను చెప్పగలను, వివరించగలను,
కాని, నా నిద్ర కు సంబందించి ఎందుకు ఇలా ఉండ లేక పొతుంది,
నాకు ఎందుకు గుర్తు ఉండట్లేదు?

నేను నిద్ర పోతున్ననని నాకు ఎందుకు తెలియట్లేదు,

-ఇంకా ఉంది

Tuesday, August 18, 2009

ఆత్మ శోధన!


నేను ఎవరు అన్నప్రశ్న నన్ను అతిగా ప్రశ్నిస్తుంటే,
సమాధానం కోసం మనసును మరచి శోధిస్తుంటే
నేను ఎం వెతుకుతున్నానో మరచిపోతుంటే,
నా ప్రయాణ దూరాన్ని కొలిచేదేలా?
ఈ దిశ, నిర్ధేశం లేని నా గమ్యాన్ని చేరుకుంటానన్న నమ్మకాన్ని నా మనసుకు కలుగ జేసేది ఎలా?
"నేను ఎవరు" అన్న ప్రశ్న నాలో ఇన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంటే,
నా మనసుకు ఎటువంటి గందరగోలానికి లోనవుతుందో అని
ఈ అమాయకపు జీవీకి మరో ప్రశ్నయి కూర్చుంది.

అయినా, నా మనసుకు సర్ధి చెప్పేది ఒకటే..ఓపిక,
ఇంకాస్త ఓపిక గా ఉండు మని,మరిన్ని ప్రశ్నలతో సతమతమవోద్దని ,
అడుగు ముందుకేస్తు మరింత ఓపిక పెంచుకొమ్మని..

ఓ నా మనసా!
ఇన్నాళ్లు నువ్వే సర్వస్వం అని నమ్మి జీవించాను,
కానీ, మనసు కానిది, ఇంకేదో ఉందని తెలిసిన మరుక్షణం,
నా వ్యక్తిత్వమే మారి పోయి, నీ ఉనికికే సవాలు గా మారింది,
అయిన కంగారు పడకు, నా జీవనాన్ని గడపడానికి నువ్వు అవసరం,
అలా అని నువ్వే నా సర్వస్వం కాదు సుమా,
నువ్వు(మనసు) కానిది, "నేను ఎవరు" అనేది ఇంకేదో ఉంది అని విశ్వసించాల్సిన స్తితి నాది.
నిన్ను అంటే మనసును పక్కన పెట్టి ఆ ఆలోచన రహిత స్తితి లో నుండి చూస్తే,
నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను!

ప్రయత్నిస్తా, నా ప్రయాణం పూర్తి అయ్యేవరకు ఆ "నేను ఎవరు" అన్న ప్రశ్న కు సమాధానం కోసమే జీవిస్తా!







imagesource
http://www.whitespacegallery.com/living-artists/sculpters-ct/michael-alfano/michael-alfano-artwork.htm