Wednesday, August 24, 2011

బాధలు లేని నేను


గతాన్ని ఎక్కువగ గుర్తు ఉంచుకోవడానికి ప్రయత్నం జరగనప్పుడు,

గతం ఎక్కువగ గుర్తు ఉంచుకోనప్పుడు - క్షమా గుణం పెరుగుతుంది,

అనుభూతులు - కోపం, ఈర్ష్య, కలుగుతున్నపుడు ఏఱుకలో ఉంటె,


మంచి - చెడు ; ఒప్పు - తప్పు ; ల మద్యలో ఉండి,

పాదరసం లా నీకేది అంటిచ్చుకోనప్పుడు,

(ఎఱుకలో ఉంటు చెసేది ఒప్పు అని నా విశ్వాసం)


నీ తప్పులని చూసి నువ్వు నవ్వుకున్నప్పుడు,

నీ అమాయకత్వాన్ని నువ్వు మెచ్చుకున్నప్పుడు,

ఙానం కోసం నువ్వు నిరంతర ప్రయత్నం సాగిస్తుంటే,


బాధలు లేను నన్ను నేను చూసుకోగల్గుతున్నాను..!