Saturday, August 29, 2009

నా శోదనే నాకు ప్రశ్నైతే ! - 2


"నేను వెళ్తున్నాను", అని అన్నప్పుడు ఆ వాక్యం లోని "నేను" అని మనం ఎవరిని సంభోదిస్తున్నాం?

నేను ఈ టపా రాస్తున్నాను, దీంట్లో నేను అంటే నా శరీరం, నా "మనస్సు" రెంటి కలయిక వల్ల నేను ఈ టపా రాయాగల్గుతున్నాను.
ఆత్మ అంటే ఈ రెంటిని కాదని ఉండేది అంటే దానిని నేను ఎలా ఊహించేది, నా అవగాహనలోకి ఎలా తెచ్చుకునేది?
సరే, పెద్దలు చెప్పినట్లు ఆలోచన లేకుండా ఉండే స్తితి ఏ ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే, మనిషి ఆలోచన లేకుండా సాంఘీక జీవనాన్ని గడపలేదు.
అంటే, ఆత్మ అనేది కేవలం ఆలోచన రహిత స్తితి కాదని అర్ధం అవుతుంది. ఏమన్టావ్?

ఆలోచన రహిత స్తితి లో మనం మనం అంటే శరీరం, మనస్సు కాదని తెలుసుకోవడానికి అవకాశంగా చూడొచ్చు.
మరి ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే నేను ఇంకా ఏమీ చేయాలి?

పెద్దవారు చెప్తారు, ధ్యానం చేయమని, ఏ? ఎందుకు ? ధ్యానం లో జరిగేది, నేయా ఆలోచన రహిత స్తితి లో జరగనిది ఒకటి కాదా?

అంటే నేను ఎక్కువ కాలం ఆ ఆలోచన రహిత స్తితి లో ఉండాలా ?

ఊహా ప్రపంచం ఎంత బాగుంటుందో..ఊహల్తో మనం ఎన్నో అద్బుటాలు సృష్ఠించొచ్చు. ఊహ కూడా ఒక ఆలోచనే కదా?

-ఇంకా ఉంది

No comments: