Saturday, August 22, 2009

నా శోదనే నాకు ప్రశ్నైతే !


మనమెందుకు మనకు తెలియనిది ఏదో ఉందని విశ్వసిస్తున్నాం?
మనమెందుకు ఆ "తెలియనిది" తెలుసు కోకుంటె జీవితం వృథ అన్న భావన లొ ఉన్నాం?
ఆత్మ సాక్షాత్కారమే అంతా అన్నట్లుగ మన మాటలు, చేష్టలు జరుగుతున్నాయి?
'ఆత్మ సాక్షాత్కారం' అనే భ్రమ లొ జీవిస్తున్నామా? లెదా, మనని మనమే ఇతరులతో వేరుగా గుర్తింప జేసుకొవదానికి ఈ భావనతొ బ్రతుకుతున్నామా?
కనిపించేది, స్పౄషించేది శరీరం, ఆలోచించేది, సంఘం తో పాటు జీవింప జేసేది ఈ మనసు.
మరింకెందుకు, ఇంకేదో ఉందని మనం అనుకుంటున్నాం, జపిస్తున్నాం, తపిస్తున్నాం?
పుట్టడం, పెరగడం, ఆశలు, ఆకలి, కోరికలు, లక్ష్యాలు, గెలుపు, ఓటమి, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, బంధాలు, ఆవేశాలు, అవమానాలు, చిరాకులు, ముసలి వాళ్ళవడం, మన ముందే చనిపోయిన వాళ్ళ లాగ మనము చనిపొవడం తెలిసిందే, మనం చూసిందే, చూస్తుందే, మనకు జరుగుతుందే,

జరగ బోయెదే అని తెలుసు.
అలాగె జీవిద్దాం.
మనకెందుకీ తంట, ఏదో లెని దాని, కనబడని దాని గురించి, ఎక్కువ మంది మాట్లాడని దాని గురించి, చాలా తక్కువ మందికె తెలిసిన దాని గురించి ఆరాటం, తెలియని దాని(అసలు, ఉన్నదో లెదో కూదా తెలియదు) గురించి తపన ?

- ఇంకా ఉంది

No comments: