
నేను ఎవరు అన్నప్రశ్న నన్ను అతిగా ప్రశ్నిస్తుంటే,
సమాధానం కోసం మనసును మరచి శోధిస్తుంటే
నేను ఎం వెతుకుతున్నానో మరచిపోతుంటే,
నా ప్రయాణ దూరాన్ని కొలిచేదేలా?
ఈ దిశ, నిర్ధేశం లేని నా గమ్యాన్ని చేరుకుంటానన్న నమ్మకాన్ని నా మనసుకు కలుగ జేసేది ఎలా?
"నేను ఎవరు" అన్న ప్రశ్న నాలో ఇన్ని ప్రశ్నలు లేవనెత్తుతుంటే,
నా మనసుకు ఎటువంటి గందరగోలానికి లోనవుతుందో అని
ఈ అమాయకపు జీవీకి మరో ప్రశ్నయి కూర్చుంది.
అయినా, నా మనసుకు సర్ధి చెప్పేది ఒకటే..ఓపిక,
ఇంకాస్త ఓపిక గా ఉండు మని,మరిన్ని ప్రశ్నలతో సతమతమవోద్దని ,
అడుగు ముందుకేస్తు మరింత ఓపిక పెంచుకొమ్మని..
ఓ నా మనసా!
ఇన్నాళ్లు నువ్వే సర్వస్వం అని నమ్మి జీవించాను,
కానీ, మనసు కానిది, ఇంకేదో ఉందని తెలిసిన మరుక్షణం,
నా వ్యక్తిత్వమే మారి పోయి, నీ ఉనికికే సవాలు గా మారింది,
అయిన కంగారు పడకు, నా జీవనాన్ని గడపడానికి నువ్వు అవసరం,
అలా అని నువ్వే నా సర్వస్వం కాదు సుమా,
నువ్వు(మనసు) కానిది, "నేను ఎవరు" అనేది ఇంకేదో ఉంది అని విశ్వసించాల్సిన స్తితి నాది.
నిన్ను అంటే మనసును పక్కన పెట్టి ఆ ఆలోచన రహిత స్తితి లో నుండి చూస్తే,
నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను!
ప్రయత్నిస్తా, నా ప్రయాణం పూర్తి అయ్యేవరకు ఆ "నేను ఎవరు" అన్న ప్రశ్న కు సమాధానం కోసమే జీవిస్తా!
imagesource
http://www.whitespacegallery.com/living-artists/sculpters-ct/michael-alfano/michael-alfano-artwork.htm
